ప్రచురణ తేదీ : Sep 23, 2017 2:36 PM IST

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ స్పెషల్ ఏంటో తెలుసా..?

మొదటి సారి తెలుగులో ఒక రియాలిటీ షో ఉహించని స్థాయిలో పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ ఆరంబ దశలో కాస్త తడబడ్డా ఆ తర్వాత ఒక్కొక్కరు ఎలిమినేషన్ అవుతుండడం షోలో జరిగే పరిణామాలు ఛానల్ కి భారీ స్థాయిలో రేటింగ్ అందించాయి. షో పాపులర్ అవ్వడానికి మెయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ చాలా కృషి చేశాడని చెప్పాలి. శని ఆదివారాల్లో తారక్ వచ్చాడంటే చాలు రేటింగ్ తార స్థాయిలో పెరుగుతోంది.

ఇక ఇన్ని రోజులు సక్సెస్ ఫుల్ గా నడిచిన బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న పార్టిసిపేట్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ఈ ఆదివారమే తేలనుంది. దీంతో తార స్థాయిలో అంచనాలు అలుముకున్నాయి. బిగ్ బాస్ ఫైనల్ షోలో నాలుగు గంటలపాటు తారక్ ఉండనున్నాడని తెలుస్తోంది. షో నిర్వాహకులు కూడా ఎపిసోడ్ ను చాల ఆసక్తికరంగా ఉండేట్లు తీశారట. చివరి టాస్క్ లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయని సమాచారం. అంతే కాకుండా బిగ్ బాస్ లో నుండి ఎలిమినేట్ అయినా వారందరిని మరొకసారి ఎన్టీఆర్ పిలవనున్నాడని తెలుస్తోంది. అలాగే కింగ్ నాగార్జునా కూడా ఈ ఫైనల్ షోలో స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం.

Comments