ప్రచురణ తేదీ : Fri, Jan 13th, 2017

జగన్ తాతని చంపించింది చంద్రబాబేనా..?

jagan-and-babu
ఏపీలో టిడిపి – వైసిపిల మధ్య విమర్శల ప్రతివిమర్సల పర్వం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా టిడిపి – వైసిపి నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కేంద్రంగా ఈ విమర్శల పర్వం మొదలైంది.జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ జగన్ పై తీవ్రంగా విమర్శలు చేస్తుండడంతో వైసిపి నేతలు కూడా అదేస్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పొగడ్తలను అడుక్కునే బిచ్చగాడిలా కనిపిస్తున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 90 శాతం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్ట్ లను చంద్రబాబు ప్రారంభించి సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రజాసేవ తప్ప వైఎస్ ఎప్పుడూ ప్రచారం కోసం ఆరాటపడలేదని అన్నారు.వై ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిగా ప్రజలకు అందాయని కితాబునిచ్చారు. మొదటి నుంచి కుల, హత్యా రాజకీయాలను ప్రోత్సాహించింది చంద్రబాబే అని ఆరోపించారు. జగన్ తాత రాజా రెడ్డి ని సైతం చంపించింది చంద్రబాబే అని సంచలన ఆరోపణలు చేశారు.రాజశేఖర్ రెడ్డి పై చేసిన అసత్య ఆరోపణలే ప్రస్తుతం జగన్ పై కూడా చేస్తున్నారని మండిపడ్డారు.

Comments