ప్రచురణ తేదీ : Oct 16, 2017 6:27 PM IST

పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం: సీనియర్ నటి

పవన్ కళ్యాణ్ పై కొంత మంది విమర్శలు చేసినా ఆయనకు వచ్చే ప్రశంసల ముందు అవి అణువంత అని చెప్పాలి. ఎవ్వరు ఎన్ని చెప్పినా పవన్ తన దారిలో తను నడుచుకుంటూ వెళతారు. ఎవరి కామెంట్స్ ని కూడా పట్టించుకోరు. అభిమానులను కూడా పట్టించుకోవద్దని చెబుతారు. నిజానికి ఆయన సినిమాలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకోలేదు. పవన్ అభిమానులు చాలా వరకు ఆయన వ్యక్తిగతాన్ని చూసి ఇష్టపడతారు. సినీ తారల్లో ఆయనకు ఎంత మంది అంభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఇప్పుడు వారిలో మరొకరు చేరిపోయారు. ఒక సీనియర్ నటి చెప్పిన మాటలు మెగా అభిమానులను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఎవరో కాదు అప్పట్లో అగ్ర నటులతో నటించిన భాను ప్రియ. ఆమె చిరంజీవి సినిమాల్లో కూడా నటించారు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమని చెప్పారు. ఆయన ప్రతి సినిమాను చూస్తానని చెబుతూ.. ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆ సినిమాలో పవన్ నటించిన తీరు అద్భుతమని.. ఎమోషనల్ సీన్స్ తో చాలా ఆకట్టుకున్నారని చెప్పారు. ఇక అవకాశం వస్తే ఆయన సినిమాల్లో నటించడానికి సిద్ధమేనని భానుప్రియ వివరించారు.

Comments