ప్రచురణ తేదీ : Dec 1, 2017 6:44 PM IST

భారీ ధరకు అమ్ముడుపోయిన మహేష్ మూవీ ఆడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మాహేష్ బాబు ప్రస్తుతం చేస్తోన్న భరత్ అనే నేను సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో బాక్స్ ఆఫీస్ రికార్డును మళ్లీ ఈజీగా మహేష్ బద్దలు కొడతాడని అందరు అనుకుంటున్నారు.

అయితే అప్పుడే ఆ బిజినెస్ మొదలైందని రీసెంట్ గా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. భరత్ అనే నేను ఆడియో రరైట్స్ ను లహరి మ్యూజిక్ కంపెనీ రూ.1.90కోట్లకు దక్కించుకుంది. దీంతో సినిమాపై ఒక్కసారిగా అందరి ద్రుష్టి మళ్లింది. కేవలం ఆడియోకే ఈ రేంజ్ లో రికార్డ్ రేట్ ను అందుకుందంటే ఇక సినిమా బిజినెస్ ఏ స్థాయిలో ఉండబోతోందో అని అందరు ఆలోచిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చేఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Comments