ప్రచురణ తేదీ : Dec 6, 2017 6:15 PM IST

‘ఆదిత్య’ కన్నా ముందుగా ఆ సినిమాకి సీక్వెల్ కావాలంటున్న బాలయ్య..!

బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో మరపురాని చిత్రాలు ఉన్నాయి. ఆ జాబితాలో నరసింహనాయుడు తప్పకుండా ఉంటుంది. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం కూడా ఓ క్లాసిక్. దానికి సీక్వెల్ వస్తే బావుంటుందనే అభిప్రాయం అందరిలో ఉంది. బాలయ్య కూడా దీని గురించి పలుమార్లు ప్రస్తావించారు. కాసేపు ఆదిత్యని పక్కన పెడితే.. అంతకంటే ముందుగా నరసింహనాయుడుకు సీక్వెల్ రానుందనే ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో జోరందుకుంది.

నరసింహనాయుడు అప్పట్లో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చింది. ఆ చిత్రం టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. రచయిత చిన్నికృష్ణ నరసింహనాయుడుకు సీక్వెల్ గా ఓ చక్కని కథని రాసుకున్నారట. కథని బాలయ్యకు కూడా వినిపించడం జరిగిందని, ఆయన ఓకె చెప్పారని వార్తలు వస్తున్నాయి. బాలయ్యకు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ తరువాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Comments