ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

బాలయ్య దర్శకుడితో చరణ్ రాయభారి ?

ramcharan
”ధ్రువ” సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తదుపరి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా సంక్రాంతి తరువాత మొదలు కానుంది. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటికే ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టాడు చరణ్. అందులో ఒకరు కొరటాల శివ కాగా, మరో దర్శకుడు మణిరత్నం? ఈ ఇద్దరు కాకుండా ఇప్పుడు మరో దర్శకుడు కూడా లైన్ లోకి వచ్చేసాడు. ఆయన ఎవరో తెలుసా .. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ తో భారీ చిత్రంగా ”గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రాన్ని తీసిన దర్శకుడు క్రిష్ ? అవును ఇప్పటికే చరణ్ తో క్రిష్ కథ చర్చలు జరిపినట్టు తెలిసినది. ఆ మధ్య వరుణ్ తేజ్ తో రాయబారి చిత్రాన్ని తీయాలనుకున్నాడు క్రిష్, కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోవడంతో ఇప్పుడు అదే ప్రాజెక్ట్ తో చరణ్ తో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసినది. ఈ సినిమాకు టైటిల్ కూడా ”రాయభారి” అని పెడతారట !! స్పై థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

Comments