ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

బాలకృష్ణ మాలో స్ఫూర్తి రగిలించారు అంటున్న మెగా హీరో

sai-dharam-tej
2017 సంక్రాంతి అటు బాలకృష్ణ అభిమానులకు, ఇటు చిరంజీవి అభిమానులకు నిజమైన పండుగలా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతికి పోటీ పడడంతో అభిమానులు అందరూ ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా చూసారు. అందరూ చిరంజీవి సినిమాకి, బాలకృష్ణ సినిమాకి పోటీ అని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ… రెండు సినిమాల హీరోలు, దర్శకులు కూడా తమ మధ్య ఎటువంటి పోటీ లేదని, విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావాలనీ అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుండుతుందని చెప్పారు. కేవలం ఇది అభిమానులు సృష్టిస్తున్న పోటీ తప్ప తాము మాత్రం ఎవరితోనూ పోటీ పడట్లేదని, తామందరూ చాలా సన్నిహితంగా ఉంటామని చెప్పుకొచ్చారు.

అటు బాలకృష్ణ మాట్లాడుతూ.. తన సినిమాతో పాటు చిరంజీవి సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకున్నారు. చిరంజీవి కూడా సంక్రాంతికి విడుదల అవుతున్న బాలయ్య సినిమాతో పాటు మిగిలిన సినిమాలు కూడా విజయవంతం కావాలన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను విష్ చేస్తూ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ట్వీట్ లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు విశేష స్పందన వస్తుందని విన్నాను. దర్శకుడు క్రిష్, మిగిలిన చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు అన్నారు. బాలకృష్ణ గారు మాలో చాలామందిలో స్ఫూర్తిని రగిలించారని సాయిధరమ్ ప్రశంసించాడు.

Comments