ప్రచురణ తేదీ : Dec 1, 2017 4:56 PM IST

సంక్రాంతి రేసులో జోరుగా..బాలయ్య ముఖంలో పండుగ కళ !

బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతోంది. రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ తాజాగా కొత్త పోస్టర్ విడుదల చేసింది. బాలయ్య కలర్ ఫుల్ లుక్ లో అలరిస్తున్నాడు. సంక్రాంతి రేసులో తానే ముందు ఉన్నాననేలా ఉంది బాలయ్య ఫోజు.

సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. బాలయ్య సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి బరిలో ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ అజ్ఞాతవాసి. ఆసక్తికరమైన ఈ పోటీ కోసం మెగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత సంక్రాంతికి ఖైదినెంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు విడుదలై మంచి విజయం సాధించాయి. ఈ సారి ఎవరు మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Comments