ప్రచురణ తేదీ : Fri, Aug 10th, 2018

ఆ దర్శకుడితో బాలయ్య సినిమా కన్ఫర్మ్ ?

ప్రస్తుతం అన్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు బాలయ్య. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఫిలిం సిటీ లో రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత బాలయ్య ఓ వైపు బోయపాటి శ్రీను తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరో వైపు ఆయనతో సినిమా చేయడానికి మాస్ దర్శకుడు వివి వినాయక్ ప్రయత్నాలు ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పటికే కథ విషయంలో వీరిద్దరికి కుదరడం లేదు .. దాంతో ఈ సినిమా విషయంలో బాలయ్య ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదు. దాంతో బాలయ్య వినాయక్ తో సినిమా లేనట్టే అంటూ వార్తలు కూడా వచ్చాయి .. అయితే తాజాగా ఈ సినిమాకు కథ ఓకే అయిందని .. కథ నచ్చడంతో బాలయ్య కూడా ఓకే చెప్పాడట. ఇదివరకే బాలయ్యతో జై సింహ చిత్రాన్ని తీసిన సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవడంతో .. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారట. ఎన్టీఆర్ సినిమా జనవరిలో నేపథ్యంలో ఈ లోగా మరో సినిమా చేయాలనీ బాలయ్య ఈ సినిమాకు ఓకే చెప్పాడట. సో మూడు నెలల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బోయపాటి శ్రీను సినిమా మాత్రం నవంబర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Comments