ప్రచురణ తేదీ : Sat, Jan 21st, 2017

కోర్టు లో లొంగిపోయిన బాలకృష్ణ ..

balakrishna
ఎస్సై సిఐ లని అసభ్య పదజాలం తో దూషించిన కేసు లో కర్నాటక మాగది ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకటవ జేఎంఎఫ్ సి కోర్టు లో లొంగిపోయారు. ఈ కేసు లో తనని అరస్ట్ చెయ్యడానికి పోలీసులు సిద్దం అవుతున్నారు అని తెలుసుకోగానే తన లాయర్ సహాయం తో బాలకృష్ణ వెంటనే కోర్టు కి వెళ్లి లొంగిపోయారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన వివరాలు.. మాగడి తాలూకాలోని అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది.ఈ సందర్భంగా తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డారని, నిందితులను అరెస్టు చేయలేదంటూ కూదురు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐలను అసభ్యపదజాలంతో ఎమ్మెల్యే దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రమేశ్ కు కూదూరు సీఐ నందీశ్ ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Comments