ప్రచురణ తేదీ : Jan 30, 2017 1:19 PM IST

బాలకృష్ణ మరొక రిస్క్ చేస్తున్నారా….?

balakrishna
నటసింహ బాలకృష్ణ తన 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే… ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ బాలయ్య స్టామినాను మరొకసారి నిరూపించింది. ఇంతటి హిట్ సినిమా తరువాత బాలకృష్ణ తర్వాత సినిమా ఎవరి దర్శకత్వంలో చేస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన ‘రైతు’ అనే సినిమాలో నటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తో సినిమా చేస్తారని కూడా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకొకసారి ప్లాప్ డైరెక్టర్ కి బాలకృష్ణ అవకాశం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘లింగా’ వంటి డిజాస్టర్ సినిమాను తీసిన కే.ఎస్ రవి కుమార్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారంటూ ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ స్టోరీని ముందు రవికుమార్.. చిరంజీవికి చెప్పారని.. ఈ స్టోరీని చిరంజీవి హోల్డ్ లో పెట్టారని, ఆ స్టోరీనే బాలయ్యతో చేయడానికి రవికుమార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే దీనికి ఇంకా బాలకృష్ణ తన అంగీకారం తెలపలేదని తెలుస్తుంది. దాంతో బాలయ్య తర్వాత సినిమా ఎవరితో చేస్తారనేది ఇంకా సస్పెన్సు గానే ఉండిపోయింది.

Comments