ప్రచురణ తేదీ : Jan 21, 2017 3:22 PM IST

ప్రియుడి నగ్న ఫోటోలను చూపించి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న ప్రియురాలు

bb
మనం చాలాసార్లు అమ్మాయిల నగ్న ఫోటోలను చూపించి, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసిన అబ్బాయిలను చాలామందినే చూసాం. ఇలాంటి కేసులు ఎన్ని పోలీస్ స్టేషనలలో నమోదు అయ్యాయి. కానీ ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా ఉన్న సమయంలో అతనిని నగ్నంగా చిత్రీకరించి ఆ ఫోటోలను బయటపెట్టకూడదంటే కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటన చెన్నైలో జరిగింది.

తమిళనాడులోని నామక్కల్ జిల్లా, రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ (26) బెంగుళూరు లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి బెంగళూరుకే చెందిన అర్చన (22) తో పేస్ బుక్ లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా కూడా మారింది. ఇద్దరూ కలిసి కొంతకాలం ఆనందంగా గడిపారు. ఆ సమయంలో ప్రేమ్ కుమార్ నగ్నంగా ఉన్నపుడు అర్చన ఫోటోలు తీసింది. వాటిని చూపించి ప్రేమ్ కుమార్ వద్ద నుండి లక్షలు వసూలు చేసింది. అంతటితో ఆగకుండా తనపై ప్రేమ్ కుమార్ అత్యాచారం చేసాడని రాశిపురం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చిన పోలీసులు ప్రేమ్ కుమార్ తో అర్చనకు 4 లక్షలు ఇప్పించారు. అయినా ఆమెకు ఆ డబ్బు సరిపోలేదు. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని లేదంటే నగ్న ఫోట్లు బయటపెడతానని బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో విసుగు చెందిన ప్రేమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువతిని అరెస్ట్ చేశారు.

Comments