ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

టార్గెట్ పులివెందుల‌.. బాబు మైండ్‌గేమ్‌కి జ‌గ‌న్ ఉక్కిరిబిక్కిరి!

jagan-and-chandrababu
నీ ఇంటికొస్తా.. నీ న‌ట్టింటికొస్తా.. నీ ముందే నీవాళ్ల‌ను ఏసేస్తా… అన్న‌ట్టే ఉంది తేదేపా అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హారం. బాల‌య్య‌బాబును మించి స‌వాల్ విసురుతున్నారు చంద్ర‌న్న‌. వైయ‌స్ ఇలాకా పులివెందుల వెళ్లి అక్క‌డ నేరుగా జ‌గ‌న్‌కి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు జ‌గ‌న్ ని సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ముప్పు తిప్ప‌లు పెట్టేందుకు ప్లాన్ చేశారు తెలుగుదేశం నేత‌లు. దాంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితిలో ఉన్నాడు జ‌గ‌న్‌. అన్ని వైపుల నుంచి త‌న‌పై అధికార‌ప‌క్షం దాడులు ప్రారంభించింది.

దీంతో ఒక్క‌సారిగా జ‌గ‌న్‌లో క‌ల‌రపాటు మొద‌లైంద‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లు పులివెందుల‌ను ప‌ట్టించుకోకుండా తిరిగిన జ‌గ‌న్ ఒక్క‌సారిగా అక్క‌డ త‌న‌వారికి ట‌చ్‌లోకి వెళ్లారుట‌. నిరంత‌రాయంగా మంత‌నాలు సాగిస్తున్నాడుట‌. అంతేకాదు తేదేపాని ఎటాక్ చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా సొంత పార్టీ నేత‌ల్ని ఆదేశించిన‌ట్టు తెలిసింది. టార్గెట్ పులివెందుల‌. ఈ ఆటకు బాబు తెర లేపారు. మ‌రి జ‌గ‌న్ ఈ విప‌త్తు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.

Comments