ప్రచురణ తేదీ : Wed, Aug 9th, 2017

మోడీపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

రీసెంట్ గా లాలూ ప్రసాద్ యాదవ్ బిజేపై చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్నిరేపుతున్నాయి. బీజేపీ పై తప్పకుండా పాగా తీర్చుకొని గుణపాఠం చెబుతామని ఆయన చెప్పిన మాటలుపై దేశ రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రీసెంట్ గా ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ఓవైసీ కూడా లాలూ వ్యాఖ్యలపు స్పందిస్తూ రాజకీయాల్లో ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మారింది.

అసదుద్దీన్ ఏమన్నారంటే..? ఒంటరిగా బిజెపిని మీరొక్కరే ఎదుర్కోవడం కష్టం. మాకు ఒక్క సాయాన్ని అందిస్తే మితో కలిసి పోరాడతామని పిలుపును ఇచ్చారు అసదుద్దీన్. రీసెంట్ గా ఓ మీడియాతో సమావేశంలో అయన ఈ విధంగా స్పందించారు. బీహార్ నుంచి సీమాంచల్‌ ని వేరు చేసి నూతన ఏర్పాటుచేస్తే లాలూతో కలిసి బిజెపిపై ఉమ్మడి పోరాటాని చేస్తామని తెలిపారు. సీమాంచల్ రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిం లకు మంచి జరుగుతుందని అసదుద్దీన్ తెలిపారు. అంతే కాకుండా మాత శక్తులతో మీరు ఒంటరిగా పోరాడలేరు మాకు సహాయం చేయండి లాలూజీ.. మీ పోరాటానికి మా బలాన్ని చేకూరుస్తామని తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ తరహా వ్యాఖ్యలు దేశ మీడియాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ విషయంపై లాలూ ప్రసాద గారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Comments