ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

చింతమనేని కి వార్నింగ్ ఇచ్చిన సొంత పార్టీ నేత

chintamaneni
వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనే చెప్పాలి. అధికార పక్షానికి తలనొప్పిగా మారిన ఈ అధికార ఆపార్టీ ఎమ్మెల్యే తన దురుసు ప్రవర్తన తో ఎన్నో సార్లు వార్తల్లో నిలిచారు.మీడియా పట్ల అనుచిత వైఖరి.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. తరచూ ఏదో ఒక వివాదానికి కారణమవుతుండడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. తాజాగా ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు చింతమనేని రూ.40లక్షలు దండుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రోజురోజుకీ రచ్చ మరింత ముదరటమే కాదు.. చివరకు తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘చింతమనేని ప్రభాకర్.. పిచ్చి వేషాలు మానుకో. సామాన్య ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాదు.. అధికారులతో వ్యవహరించిన రీతిలో ఇష్టానుసారంగా పార్టీ నేతల్నితిట్టేస్తే ఊరుకోం’’ అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేయటం గమనార్హం. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డబ్బులు మారాయని, అందుకు ప్రతిఫలంగా రెడ్డి అనురాధను ఏంపీపీ పదవి నుంచి తప్పించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి ఆ పదవిని కట్టబెట్టేందుకు చింతమని కుతంత్రాలు చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ఇలాంటివి దీర్ఘకాలం సాగితే చింతమనేనికే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశానికి దెబ్బ పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Comments