ఏపీలో విద్యార్ధులకు జపనీస్ తప్పనిసరి!

chandrababunaidu1
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జపాన్ పర్యటన చేసి అక్కడ ప్రముఖులతో చర్చలు జరిపి పెట్టుబడులను రాబట్టే అంశంలో సఫలత సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సహకారంతో పాటు పెట్టుబడులను పెట్టడానికి ముందుకు వస్తున్న జపాన్ దేశ భాషను ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు తప్పనిసరిగా నేర్చుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కాగా దీనిపై సోమవారం జపాన్ కు చెందిన ప్రవాస భారతీయుడు రాజీవ్ పాండ్యన్ సోమవారం చంద్రబాబుతో భేటి అయ్యి పాఠశాల స్థాయిలో జపనీస్ ను ప్రవేశపెట్టే అంశంపై చర్చలు జరిపారు.

ఇక మరో పక్క జపాన్ నుండి ఆంధ్రప్రదేశ్ కు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నందున అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్ధులను సిద్ధం చెయ్యాలని చంద్రబాబు సూచిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల స్థాయి నుండే జపనీస్ బాషను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. కాగా దీనిపై గనుక ప్రభుత్వం ఒక స్పష్టతకు వస్తే ఇకపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో జపనీస్ భాష తప్పనిసరి కానుంది.

Comments