ప్రచురణ తేదీ : Jan 10, 2018 8:02 PM IST

అనంతపురాన్ని దత్తత తీసుకోనున్న లోకేష్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అధికార టిడిపి నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాలలో భాగంగా పంచాయితీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ నేడు అనంతపురం లో పర్యటించారు. అనంతపురం తో తనకు వున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్న ఆయన ఈ సందర్భంగా ఒక సంచలన ప్రకకటన చేశారు. త్వరలోనే తాను అనంతపురాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆరునెలల పాటు బస్ లో పడుకుని పరిపాలన చేసే పరిస్థితి నుంచి నేడు రాజధాని నిర్మాణం చేపట్టే వరకు వచ్చామని ఆయన తెలిపారు.

రాష్ట్రం లో చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నాయకులు తమ పార్టీ లో చేరుతున్నారని అన్నారు. గోదావరి, కృష్ణ నదులను కలిపినా ఘనత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుకె దక్కుతుందని ఆయన అన్నారు. దేశం లో అతి చిన్న వయసులోనే మంత్రిని అయ్యానని, చిన్నప్పుడే నాన్న గారు గ్రామాలకు తన వంతు సేవ చేయాలని చెప్పడంతో పంచాయితీరాజ్ శాఖను ఎంచుకన్నానని ఆయన తెలిపారు. జగన్ తన పేపర్ లో ఎల్ ఈ డి బల్బుల పంపిణీ లో కుంభకోణం జరిగిందని రాయడం విడ్డూరమని, దమ్ముంటే ఆధారాలతో బయట పెట్టాలని. ఒక దొంగ పేపర్, దొంగ ఛానల్ ని నడుపుతున్న జగన్ అతి పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు…

Comments