ప్రచురణ తేదీ : Fri, Feb 10th, 2017

ఆరు నెలల్లో లేపేస్తా అంటూ బెదిరించిన మంత్రి కొడుకు ఎవరు..?


తనని ఆరునెలల్లో చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని శ్రీకాళ హస్తి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ఎస్పీ కి ఫిర్యాదు చేసారు. ఎపి అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి తనని బెదిరిస్తున్నాడని మధుసూదన్ ఫిర్యాదు లో పేర్కొన్నారు. అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఆయన ఎస్పీని కోరారు.

చిత్తూరు జిల్లా వైసిపి అధ్యక్షుడు నారాయణ స్వామితో కలసి మధుసూధన్ ఎస్పీని కలిశారు. కాగా బొజ్జల కుటుంబం తరచుగా వివాదాల్లో నిలుస్తోంది. గతంలో కూడా బొజ్జల సతీమణి బృందమ్మ శ్రీకాళహస్తి ఆలయం లో సిబ్బంది తో వివాదానికి దిగింది. టిడిపి నేతల ఆదేశాలను పాటించలేదని ఆమె ఆలయ సిబ్బందితో వాగ్వాదం చేసిన విషయం వివాదంగా మారింది.

Comments