ప్రచురణ తేదీ : Dec 5, 2017 2:40 PM IST

నాగ్ ను పక్కన పెట్టి … వెంకీకి ఓకే అంటున్న స్వీటీ ?

దేవసేన గా బాహుబలితో మరింత క్రేజ్ పెంచుకున్న అందాల భామ అనుష్క ప్రస్తుతం నటిస్తున్న భాగమతి సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అనుసఖ తాజాగా వెంకటేష్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తాజాగా వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇటివలె హైద్రాబాద్ లో మొదలైంది. ఆటా నాదే .. వేటా నాదే పేరుతొ తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం పై చర్చలు జరిగాయి .. ముందుగా గ్లామర్ భామ కాజల్ పేరు వినిపించింది .. కానీ కాజల్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో తాజాగా అనుష్క పేరు పరిశీలనకు వచ్చింది. ఇప్పటికే అనుష్క తో చర్చలు జరుపుతున్నాడట దర్శకుడు. ఇదివరకే వెంకటేష్ తో చింతకాయల రవి, నాగవల్లి సినిమాల్లో నటించింది అనుష్క .. తాజాగా మరోసారి జోడి కట్టేందుకు సిద్ధం అయింది. మరో వైపు నాగార్జున వర్మ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకోసం అనుష్క పేరు వినిపించింది .. కానీ ఆ సినిమాకు నో చెప్పడంతో మరో కొత్త భామను దించేశారు.

Comments