ప్రచురణ తేదీ : Dec 30, 2016 11:41 AM IST

ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్న .. అనుష్క?

anushka45
అనుష్క షాకింగ్ నిర్ణయం తీసుకుంది? ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోతున్న ఈమెకు పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గ్లామర్ భామగా అనుష్క తెలుగు తెరపై తనదైన ఇమేజ్ తెచ్చుకుంది. ఇక ‘అరుంధతి’,’ రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలతో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై స్పందించిన అనుష్క పెళ్లి మనం అనుకున్నప్పుడు జరగదు. దానికి సమయం రావాలి అంటూ, నాకింకా పెళ్లి ఘడియలు రాలేదని, నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని క్లారిటీ ఇచ్చింది.

Comments