ప్రచురణ తేదీ : Nov 9, 2017 5:41 PM IST

తన లవ్ మ్యాటర్ ని బయటపెట్టిన అనుష్క

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం దేవసేన గా అందరి మదిలో మెదులుతోంది అనుష్క. బాహుబలి సినిమా తర్వాత మొన్నటి వరకు ఏం చేస్తుందో కూడా తెలియని అనుష్క రీసెంట్ గా తన పుట్టిన రోజు దగ్గర నుంచి భాగమతి తో అందరిని పలకరిస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మళ్లీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకొంది.అయితే ఇటీవల అనుష్క ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను ప్రేమించిన వ్యక్తి గురించి క్లారిటీగా చెప్పేసింది.

ఒకానొక సమయంలో అనుష్క మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కి ఫిదా అయిపోయిందట. అంతే కాకుండా అతన్ని లవ్ కూడా చేసినట్లు స్వీటీ వివరించింది. ఇప్పటికి కూడా రాహుల్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న అనుష్క కు ఇప్పటికి కూడా ప్రపోజల్స్ బాగానే వచ్చాయట కానీ జేజమ్మ మాత్రం జీవితంలో లవ్ చేసింది మాత్రం తన అభిమాన క్రికెటర్నే అని తెలిపింది. ప్రస్తుతం అనుష్క భాగమతి చిత్రం చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Comments