ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

జై లవకుశ అప్పుడే నెగిటివ్ వార్తలు ప్రచారం! తట్టుకోలేకే!


జై లవకుశ ట్రైలర్ తో జూనియర్ ఎన్టీఆర్ మరో సారి అలనాటి తారకరాముడుని గుర్తుకు చేసాడు. మూడు పాత్రల్లో అతను చూపించిన వేరియేషన్స్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతూ ఉంటె మరో వైపు సినిమా మీద అప్పుడే యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో సన్నివేశాలని చిరంజీవి సూపర్ హిట్ సినిమా రౌడీ అల్లుడు తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. రౌడీ అల్లుడు సినిమాకి, జై లవకుశ సినిమాకి పోలికలు ఉన్నాయంటూ, సంబంధం లేని ఒక థియరీ పట్టుకొని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో మూడు పాత్రలని చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు సినిమాతో పోలికలు పెడుతున్నారు. ఇది ముగ్గురు మొనగాళ్ళు సినిమాకి మరో వెర్షన్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే మంచి కథ, అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్, బాండింగ్ చూపించినపుడు. అంతకు ముందు వచ్చిన సినిమాతో పోలికలు పెట్టడం ఈ మధ్య సోషల్ మీడియాలో భాగా అలవాటు అయిపొయింది. అయితే హ్యూమన్ బండింగ్ ఎలివేట్ చేసే సమయంలో కొన్ని సినిమాలు పోలికలు కనిపించినంత మాత్రాన ఆ సినిమా, ఈ సినిమా ఒకటే అనుకోవడం పొరపాటు. తాజాగా వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాని మలయాళీ మూవీ కలితో పోల్చి చూసారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక జై లవకుశ కూడా ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరియర్ లో కనిపించని విధంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి పాత కథలతో పోలిక పెట్టినంత మాత్రాన సినిమా రేంజ్ ని ఎవరు ఆపలేరు.

Comments