ప్రచురణ తేదీ : Jan 20, 2017 3:00 AM IST

షాక్ … హిజ్రాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో?

hizra
ఏంటి టైటిల్ వినగానే షాక్ అయ్యారా ? మీరు విన్నది నిజమే .. ఇప్పటి వరకు వెండితెరపై గ్లామర్ ఆరబోసి రెచ్చగొట్టే ముద్దుగుమ్మలను చాలా మందిని చూసాం. కానీ ఇప్పుడు ఓ ట్రాన్స్ జెండర్ హీరోయిన్ గా మారుతుంది? అదికూడా ఓ స్టార్ హీరో సినిమాలో కావడం విశేషం !! ఆ వివరాల్లోకి వెళితే… మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ”పెర్నాబు” సినిమాలో 19 ఏళ్ల అంజలి అమీర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు ట్రాన్స్ జెండర్ తో అమ్మాయిగా మరి .. ప్రస్తుతం మోడలింగ్ లో క్రేజ్ తెచ్చుకుంది. తనను హీరోయిన్ గా ఎంపిక చేసినందుకు అంజలి థాంక్స్ చెప్పింది. ఈ వార్తతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మరి అంజలి హీరోయిన్ గా ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి ?

Comments