ప్రచురణ తేదీ : Jan 26, 2017 7:18 PM IST

ఇక్కడకు రండి, లేదంటే ఢిల్లీకి వెళ్లండి..పవన్ పై దాడికి దిగిన లేడీ ఎమ్మెల్యే !

anithaa
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దత్తు తెలుపుతూ అధికార టిడిపి, బీజేపీ ల పై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు కూడా పవన్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. తెలంగాణాలో ఉంటూ ఏపీ లో రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటని టిడిపి ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు. ఆర్కే బీచ్ లో అవాంఛనీయ ఘటనలు జరిగితే పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. కాపు ఉద్యమ సమయంలో కూడా హింస చెలరేగిందని అన్నారు.

మొదట పవన్ ఇక్కడకు వచ్చి మాట్లాడాలని లేకుంటే ఢిల్లీ వెళ్లి మాట్లాడాలని సూచించారు.ప్రత్యేక హోదా పై ప్రశ్నించే ధైర్యం ఉంటె ఢిల్లీ వెళ్లి ప్రధానిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేస్తూ టిడిపి నేతలు సుజనా చౌదరి, రాయపాటి సాంభశివ రావు లపై విమర్శల దాడి చేస్తున్న విషయం తెలిసిందే.

Comments