ప్రచురణ తేదీ : Tue, Sep 8th, 2015

పొలం దున్నితే పంటకు బదులు బంగారు నాణాలు పండాయి..!

coins
రైతు అరక దున్ని విత్తనం నాటి మందులు వేస్తె.. పంట పండుతుంది. ఏ విత్తనాలైతే వేస్తారో అదే పంట పండుతుంది. పత్తి పంట వేస్తె.. పత్తే పండుతుంది కాని మరో పంట పండదు. అయితే, ఇటీవల కాలంలో రైతులు పంటలు వేయాలంటేనే భయపడిపోతున్నారు. పంట వేసేందుకు డబ్బులు ఉండవు.. అప్పో సొప్పో చేసి పంట వేస్తె.. దానికి నీళ్ళు ఉండవు. దీంతో పంటలు పండవు. ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి రైతులు పొలం వేయడం మానేసి ఏదో పని చేసుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలంలోని సౌమ్యా తండాలో ఓ రైతు పొలం దున్నుతుంటే.. బంగారు నాణాలు పండాయి. బంగారు నాణాలు ఏమిటని ఆశ్చర్యపోకండి. బంగారు నాణాలే. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణాలు ఉన్న కుండ ఒకటి పొలంలో బయట పడింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ రైతును అదుపులోకి తీసుకొని బంగారు నాణాలు స్వాదీనం చేసుకున్నారు.

Comments