తెలుగు సినిమా పిచ్చికి.. అమెరికా కంపెనీ డమాల్!

తెలుగు ప్రజలు ఎక్కడున్న సినిమా పిచ్చి మాత్రం పీక్ లో ఉంటుంది ఎన్ని పనులు ఉన్న కొత్త సినిమా, అది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇక ఎక్కడున్న థియేటర్స్ బాట పట్టాల్సిందే. ఈ సంగతి అమెరికాలో అయిన సరామామూలె, ఇక మన తెలుగు ప్రజలకి మరో మంచి అలవాటు ఉంది బై వన్ గెట్ వన్ అంటే అది ఏంటి అనే విషయం పక్కన పెట్టి పిచ్చి పిచ్చిగా కొనేస్తారు . ఇక అది సినిమా టికెట్ అయితే ఇక ఏమైనా ఉంటుందా అమ్మే వాళ్ళకి ఖాళీ ఉండదు. కొనేవాళ్ళకి అలుపు ఉండదు. ఈ విషయం తెలియక ఒక అమెరికన్ కంపెనీ తెలుగు సినిమా టికెట్ పై ఆఫర్ పెట్టింది. ఒక టికెట్ కొంటె ఇంకో టికెట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది.

ఇంకేముంది ఆ ప్రకటన బయటకు రావడం లేట్ . వరుసగా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండటంతో, తెలుగు సినిమా అభిమానులు ఎ మాత్రం ఆలోచించకుండా బై వన్ గెట్ వన్ ఆఫర్ ని వినియోగించుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ఈ ఆఫర్ ని సదరు సంస్థ శుక్ర, శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అయితే ఎప్పుడైతే ఒక్క సారి తెలుగు సినిమా లవర్స్ ఆ ఆఫర్ పై తమ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారో సదరు కంపెనీ భయపడి ఆఫర్ ని ఉన్నపళంగా క్యాన్సిల్ చేసేసింది. ఉదయం ఆఫర్ ప్రకటించి, ఈ బుకింగ్ ఎక్కువ కావడంతో సాయంత్రానికి ఆఫర్ ని వెనక్కి తీసుకుంది. దీంతో ఉదయం ఎంతో ఆశగా ఆఫర్ చూసి ఇంటికి వెళ్లి టికెట్ బుక్ చెద్దామానుకున్న తెలుగు సినిమా లవర్స్ కి నిరాశ ఎదురైంది. మొత్తానికి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న, ఎవరికైన తమ ప్రతాపం ఎలా ఉంటుందో చూపించడం గ్యారెంటీ అని మాత్రం అర్ధమైంది.

Comments