తాంత్రిక పూజలతో లోకేష్ కు సంబంధం..!

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అజ్ఞాతవ్యక్తి తాంత్రిక పూజలు నిర్వహించిన వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. అధికార పార్టీపై ప్రతిపక్షం తాంత్రిక పూజల వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు చేస్తోంది. వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబే ఆ తాంత్రిక పూజలు దుర్గ ఆలయంలో జరిపించారని ఆరోపించారు.

ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇప్పుడు అధికారులపై నిందలు వేస్తున్నారని రాంబాబు ఆరోపించారు. జనవరి 1 సందర్భంగా రాష్ట్ర దేవాలయాల్లో ఎక్కడా పూజలు నిర్వహించలేదని, కానీ చంద్రబాబు కుటుంబానికి మాత్రం వేద పండితులు ఆశీర్వాదాలు అందించారని అన్నారు. కాగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రధాన అర్చకులు భద్రీనాథ్ అంటున్నారు.

Comments