ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

తొమ్మిదేళ్ల క్రితం బన్నీ, శిరీష్ లు కలసి ఏం చేశారంటే..!


అల్లు అర్జున్ ఆర్య 2 చిత్ర సమయంలోని ఓ మధురానుభూతిని సోదరుడు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆర్య 2 చిత్ర షూటింగ్ సమయంలో దుబాయ్ లో బన్నీ తో కలసి షాపింగ్ చేసిన ఫోటోలని అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలో బన్నీ స్టయిలిష్ అశ్విన్ వాలె ని కూడా చూడొచ్చు. షాపింగ్ చేసిన తరువాత ఈ ముగ్గురు కలసి దిగిన ఫోటో ఇది.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం నాపేరు సూర్య చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు చిత్రం ద్వారా మెప్పించాడు. ఇప్పుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ నటిస్తున్నాడు.

Comments