ప్రచురణ తేదీ : Dec 5, 2017 6:25 PM IST

అల్లు శిరీష్ గట్టిగానే కొట్టాడే..విడుదలకు ముందే 3 కోట్లా?

కెరీర్ లో మంచి హిట్ కోసం పరితపిస్తున్న హీరోలలో అల్లు శిరీష్ మొదట స్థానంలో ఉన్నాడని చెప్పాలి. గత కొంత కాలంగా ఈ హీరో ఎన్ని సినిమాలను చేసినా హిట్స్ అందుకోవడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి తనకంటూ మంచి మార్కెట్ ని సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ నెల 29న ఒక్క క్షణం అనే సినిమాతో రాబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ రూపంలో లో చిత్ర నిర్మాత భారీ స్థాయిలో అందుకున్నాడు. ప్రముఖ జెమిని టీవీ ఛానెల్ ఒక్క క్షణం శాటిలైట్ రైట్స్ ను 3.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు విఐ.ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సురభి – సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీనివాస్ అవసరాల ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.

Comments