ప్రచురణ తేదీ : Dec 4, 2017 6:27 PM IST

గోవాలో దుమ్ము రేపుతున్న నా పేరు సూర్య ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా చిత్రం ప్రస్తుతం గోవా లో బిజీ షెడ్యూల్ జరుపుకుంటుంది. నవంబర్ 30 నుండి అక్కడే షూటింగ్ జరుగుతుండగా ఈ రోజు నుండి గ్లామర్ భామ అను ఇమ్మానుయేల్ పాల్గొననుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా గోవా షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు .. నేటి నుండి అల్లు అర్జున్ అను ఇమ్మానుయేల్ పై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. మరో నలుగురు రోజులపాటు అక్కడే షూటింగ్ జరిపి యూనిట్ హైద్రాబాద్ రానుంది. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Comments