ప్రచురణ తేదీ : Dec 26, 2016 9:04 PM IST

బన్నీ అకౌంట్ లోకి మరో .. కంపెనీ ?

allu-arjun
స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మంచిజోరుమీదున్నాడు. ఇటీవలే తనకు కూతురు పుట్టడంతో అయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇప్పటికే ”సరైనోడు” సినిమాతో మంచి సక్సెస్ అందుకుని ప్రస్తుతం ”దువ్వాడ జగన్నాధం” .. డీజే గా రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ మధ్య షూటింగ్ కు బ్రేక్ వేసిన బన్నీ .. మళ్ళీ మరో షెడ్యూల్ మొదలు పెట్టాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ ఓ వైపు సినిమాలు నటిస్తూనే .. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లోను తన క్రేజ్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ పలు బడా కంపెనీల్లో ఎండార్స్ చేస్తున్నాడు. హీరో మోటర్ కార్ప్ , లాట్ మొబైల్స్, ఓ ఎల్ ఎక్స్ , కోల్గేట్ , జాయ్ అలుక్కాస్, 7 అప్, హాట్ స్టార్ యాప్ లకు ప్రచారం చేసిన బన్నీ ఇప్పుడు మరో కొత్త కంపెనీ ని పట్టాడు … అదే మహా సిమెంట్. లేటెస్ట్ గా ఈ కంపెనీ కి ఎండార్స్ చేయడానికి ఓకే చెప్పడంతో బన్నీ వెల్ కం అంటూ వైజాగ్ లో పెద్ద హోర్డింగ్ తో అదరగొట్టిన మహా సిమెంట్ అక్కడ తన కొత్త బ్రాంచ్ ని ప్రారంభించబోతుంది.

Comments