ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

అల్లరి నరేష్ కి కోపం వచ్చింది? అలా ఎలా అంటారు?


వెండితెరపై అల్లరి చేస్తూ ఆకట్టుకున్న అల్లరి నరేష్ తాజాగా నటించిన ”మేడమీద అబ్బాయి” సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలై మిక్సెడ్ టాక్ రావడంతో హీరో అల్లరి నరేష్ పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయన పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అల్లరి నరేష్ హీరోగా సినిమాలు మానేస్తాడని, దర్శకత్వం చేస్తాడంటూ వార్తలు రావడంతో నరేష్ స్పందించాడు .. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు .. కనీసం ఇది నిజమా అని కూడా ఎవరు అడగకుండానే ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసుకుంటున్నారు అన్నాడు. నేను హీరోగా సినిమాలు మానేసి దర్శకత్వం చేసుకుంటానకి రాసారని .. కానీ తానూ హీరోగానే సినిమాలు చేస్తానని, ఇప్పటికే రెండు ప్రాజెక్ట్ రెడీ గా ఉన్నాయని అన్నారు. ఇక దర్శకత్వం చేయడం కూడా రెండేళ్ల తరువాత ఉంటుందని, అలాగే మా స్వంత బ్యానర్ లో కూడా వచ్చే ఏడాది సినిమా ఉంటుందని అన్నారు. దాంతో పాటు తాను నటించిన ”మేడమీద అబ్బాయి” మంచి హిట్ చిత్రంగా రన్ అవుతుందని, స్పూఫ్ లు లేకుండా మంచి కామెడీ చేసావని అంటున్నారని అంటున్నాడు. దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మొద్దని, అసలు ఇలాంటి వార్తలు ఎందుకొస్తాయో అంటూ ఫీల్ అయ్యాడు.

Comments