ప్రచురణ తేదీ : May 22, 2018 9:21 PM IST

ఫన్ రాజా ఫన్ అంటున్న అల్లరోడు ?


అల్లరి నరేష్ హీరోగా భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేసారు. ఇంతకీ టైటిల్ ఏమిటో తెలుసా .. ఫన్ రాజా ఫన్. సుడిగాడు లాంటి సంచలన విజయం తరువాత అల్లరి నరేష్ – భీమనేని ల కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దాంతో పాటు సుడిగాడు తరువాత కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని అల్లరి నరేష్ మళ్ళీ భీమనేనితో హిట్ కొట్టాలనే ఆలోచనతో ఈ సినిమాకు కమిట్ అయ్యాడు. మేఘా శుక్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అన్నట్టు ఈ సినిమాతో సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి సునీల్ తో కలిసి ఫన్ రాజా ఫన్ అంటున్న అల్లరోడికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.

Comments