ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

కిలాడీ అక్ష‌య్ ఫ్యాన్సా మ‌జాకానా?

హీరోల పుట్టిన‌రోజు వేళ‌ అభిమానులు సామాజిక కార్య‌క్ర‌మాలు చేయ‌డం స‌హ‌జంగా చూస్తున్న‌దే. ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలు, అనాధాశ్ర‌మం, వృద్ధాశ్ర‌మాల్లో సోష‌ల్ వ‌ర్క్‌పైనా దృష్టి సారిస్తున్నారు. దీనివ‌ల్ల స‌మాజానికి ఎంతో కొంత మేలు జ‌రుగుతోంద‌న‌డంలో సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహా బాల‌కృష్ణ పుట్టిన‌రోజుల వేళ ఇరు హీరోల అభిమానులు సంఘ‌సేవ‌లో పాల్గొంటున్నారు. బ్ల‌డ్ డొనేష‌న్ కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు.

బాలీవుడ్‌లో కిలాడీ అక్ష‌య్ కుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ చేసిన హంగామా చూస్తే స్ట‌న్న‌వ్వాల్సిందే. ఉత్త‌రాదిన ప‌లు న‌గ‌రాల్లో కిలాడీ ఫ్యాన్స్ అద్భుత‌మైన .. మేలైన ప‌నులెన్నో చేశారు. అనాధాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాల‌కు డొనేష‌న్లు ఇచ్చారు. ఇక అన్నం దొర‌క‌ని చోట అన్నం పంచారు. ర‌క్త దాన కార్య‌క్ర‌మాలు చేశారు. ముంబై, సోలాపూర్‌, ఒడిసా, రాంచీ, అక్ష‌రాంచీ, నాగ్ పూర్, సిల్ చార్ .. ఇలా అన్ని న‌గ‌రాల నుంచి అభిమానులు ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం విశేషం.

Comments