ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

కొత్త పార్టీ పెట్టబోతున్న అఖిలేష్ యాదవ్…?

akhilesh-kumar
ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పులు చేసుకుంటున్నాయి. తండ్రి, కొడుకుల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇద్దరూ సంధి చేసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మళ్ళీ వెంటనే ఎవరూ వెనక్కి తగ్గట్లేదు రాజీ పడడం కష్టం అంటున్నారు. అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఊసరవెల్లిని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన తండ్రికి వ్యతిరేకంగా కొత్త పార్టీ పెడుతున్నారని వస్తున్న వార్తలు చూస్తే అక్కడి రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో ఎవరికీ ఒక పట్టాన అంతుబట్టట్లేదు.

సమాజ్ వాదీ పార్టీ గుర్తు ‘సైకిల్’ తనకే చెందుతుందని తండ్రి, బాబాయిల మీద ఒంటరి పోరాటం చేస్తున్న అఖిలేష్ పరిస్థితులు తనకు అనుకూలించకపోతే కొత్త గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బుధవారం ములాయం సింగ్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ పేరు, సైకిల్ గుర్తును మార్చుకోవాల్సిన అవసరం లేదని అదే గుర్తుతో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అఖిలేష్ మాత్రం వేరే పేరు, వేరే గుర్తుతో పోటీ చేయాలనుకుంటున్నారని ఆయన అన్నారు. అఖిలేష్ కు మద్దతుగా ఆయన మరొక సోదరుడు రాంగోపాల్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని కలిసి కొత్త పార్టీ పేరుతొ పాటు, గుర్తు కోసం కూడా దరఖాస్తు చేసారని ఆయన చెప్పారు.

Comments