ప్రచురణ తేదీ : Sep 28, 2017 11:11 AM IST

పూరీ జగన్నాథ్ ఈ సారి మెహబూబా అంట? మరి మంట.. తంటా?


పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి న‌టించే తాజా సినిమాపైనే ప్ర‌పంచం క‌ళ్ల‌న్నీ. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, అటు కామ‌న్ ఆడియెన్ ఈ సినిమాపై ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. త్వ‌ర‌లోనే లాంచింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని ఇదివ‌ర‌కే పూరి క‌నెక్ట్స్ ప్ర‌క‌టించింది. నేడు పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆకాష్ పూరి న‌టించే తాజా చిత్రం టైటిల్ లోగోని ట్విట్ట‌ర్‌లో ఆవిష్క‌రించారు. ఈ సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్‌. `మెహ‌బూబా` టైటిల్‌కి త‌గ్గ‌ట్టే ఇదో చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని తెలుస్తోంది. ఆకాష్‌ని ఎట‌ర్న‌ల్ అనిపించే ఆస‌క్తిక‌ర ప్రేమ‌క‌థా చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా ఎలివేట్ చేసేందుకు పూరి ఎటెంప్ట్ మొద‌లుపెట్టాడు.

`మెహ‌బూబా` 1971 ఇండియా- పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కే చ‌క్క‌ని ప్రేమ‌కథా చిత్రం. పూరి త‌న లిమిట్స్‌ని క్రాస్ చేసి మ‌రీ తెర‌కెక్కిస్తున్నాన‌ని చెబుతున్నాడు. ఆకాష్ స‌ర‌స‌న మంగోళియ‌న్ భామ‌ నేహా శెట్టి నాయిక‌గా న‌టిస్తోంది. అక్టోబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. హిమాచల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, రాజ‌స్థాన్ త‌దిత‌ర చోట్ల రేర్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ సాగించ‌నున్నారు. `నిన్నే పెళ్లాడుతా`, `సూప‌ర్‌` చిత్రాల‌కు సంగీతం అదించిన సందీప్ చౌతా .. మెహ‌బూబా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఆస‌క్తిక విష‌యం ఏమంటే. .. పూరి చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం చూస్తుంటే పూరి మ‌రో `బొంబాయి`ని, `దిల్‌సే`ని త‌న‌దైన స్టైల్లో ఎలివేట్ చేస్తున్నాడా? హిందూ- ముస్లిమ్ వివాదాస్ప‌ద ప్రేమ‌క‌థ‌ను నేప‌థ్యంగా ఎంచుకున్నాడా? అన్న సందేహాలు రాక మాన‌వు. క‌థానాయిక ఓ ముస్లిమ్‌, హీరో హిందూ య‌థావిధిగా.. దీన్ని బ‌ట్టి సందేహం క‌లుగుతోంది. ఆకాష్ సినిమా వివాదాల‌తో ప్ర‌మోష‌న్ కొట్టేయాల‌న్న ప్లాన్ ఈ స్క్రిప్టులో ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. చూద్దాం.. అస‌లు పూరి మైండ్‌లో ఏం ఉందో?

Comments