ప్రచురణ తేదీ : Jan 20, 2017 5:51 PM IST

జగన్ ను తమ ప్రాంతానికి రావొద్దు అంటున్న రైతన్నలు….!

jagan1
2019 ఎన్నికలే లక్ష్యంగా వైస్సార్సీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్లకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలుగుదేశం పార్టీ నాయకులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి భూమిని తీసుకోవడం అక్రమమంటూ విమర్శించారు. ఆ భూములను రైతులే స్వచ్చందంగా ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంటుంది. కానీ జగన్ మాత్రం ఆ భూములను రైతుల నుండి అన్యాయంగా లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు వ్యతిరేకంగా అక్కడి రైతులు గళమెత్తారు.

రాజధాని గ్రామాల్లో వైస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన పర్యటనకు అక్కడ రైతుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కురగల్లు వద్ద పలువురు రైతులు ‘జగన్ గో బ్యాక్’ అంటూ రాసి ఉన్న పోస్టర్లు పట్టుకుని హడావుడి చేశారు. భూములు స్వచ్చందంగా ఇచ్చిన 98 శాతం రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. భూబకాసురుల మమ్మల్ని కాపాడతామని అంటున్నారని జగన్ ను ఉద్దేశించి రైతులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతుల వద్ద నుండి పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

Comments