ప్రచురణ తేదీ : Dec 4, 2017 11:55 PM IST

అజ్ఞాతవాసి @ 209..ఇది అల్టిమేట్ రికార్డ్..!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ ల సూపర్ హిట్ కాంబినేషన్లో ఈ చిత్రం వస్తుండడంతో ఎక్కడలేని క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ లో ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేయగా తాజాగా ఓవర్శిస్ విడుదల విషయంలో సంచలన రికార్డు సృష్టించబోతోంది. గతంలో ఏ చిత్రం విడుదల కాని విధంగా భారీ స్థాయిలో అజ్ఞాతవాసిని విడుదుల చేస్తున్నారు.

ఓవర్శిస్ లో 209 లొకేషన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. గతంలో ‘బాహుబలి2’ 126 లొకేషన్లలో, ‘ఖైదీ నెం 150’ 74 లొకేషన్లలో, కబాలి 73 లోకేషన్లలో విడుదలయ్యాయి. కాగా అజ్ఞాతవాసి చిత్రం నెలకొని ఉన్న అంచనాల దృష్ట్యా లొకేషన్ల సంఖ్య డబుల్ సెంచరీ మార్క్ దాటేసింది. జనవరి 10 ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించారు.

Comments