ప్రచురణ తేదీ : Sun, Apr 22nd, 2018

నేను గర్భవతిని కాను.. : ?నటి ఇలియాన

ఇలియానా తల్లికాబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ఈ పుకార్లపై ఆమె బదులివ్వకపోవడంతో ఇలియానా గర్భం దాల్చిన మాట నిజమేనంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పింది ఇలియానా. తాను గర్భవతిని కాందంటూ శనివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నది. ఓ ఫొటోను పోస్ట్ చేసిన ఇలియానా ఆండ్రూ నీబోన్ తీశారని చెప్పింది. చాలా కాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా ప్రేమలో ఉన్నటు,్ల ఇటీవలే వారిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆండ్రూతో ప్రేమాయణం, పెళ్లి వార్తలపై ఇప్పటివరకు పెదవివిప్పలేదు ఇలియానా. వ్యక్తిగత విషయాల్ని పంచుకోవడం తనకు ఇష్టం ఉండదంటూ బదులిస్తూ వచ్చింది ఈ గోవా సుందరి.

Comments