ప్రచురణ తేదీ : Dec 31, 2016 11:27 AM IST

నిన్ను చంపేస్తాం – నటుడికి బెదిరింపు ఫోన్ లు .. ఎవరు వాళ్ళు

anand-raj
దాదాపు ఆయన అన్నాడీఎంకే లో 12 సంవత్సరాల పాటు ఉన్నాడు, జయలలిత కి బాగా దగ్గర వ్యక్తి గా లాయలిస్ట్ గా మంచి పేరు కూడా ఉంది. కానీ శశికళ హెడ్ అవ్వగానే ఆయన పార్టీ కి రాజీనామా చేసాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా మనకి ఐడియా ఉన్న ఆనంద్ రాజ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పోనీ పార్టీ కి రాజీనామా చేసేసాడు కదా అని ఆయనని వదలడం లేదు అక్కడి జనాలు. ఆయనకి తాజాగా ఫోన్ బెదిరింపులు ఎక్కువ అయ్యాయి అని తెలుస్తోంది. తనని చంపేస్తాం అంటూ కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని ఫిర్యాదు చేసారు . ఆ ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడంతో పాటు ఆనంద్ రాజ్ ఇంటికి సెక్యూరిటీ కల్పించారు. ప్రస్తుతం ఆనంద్ రాజ్ రాజీనామా – అనంతరం బెదిరింపులు – పోలీసు సెక్యూరిటీ వంటి విషయాలతో ఈయన వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. అన్నా డీఎంకే లో ఉత్తమ క్రమశిక్షణ ఉన్న నాయకుడిగా ఆనంద్ గురించి మాట్లాడుకుంటారు. అమ్మకి ఇష్టం లేని పరిస్థితులు పార్టీ లో జరుగుతున్నాయి అనీ ఆమె కాకుండా ఇంకెవరో పార్టీ కుర్చీ ఎక్కడం తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Comments