ప్రచురణ తేదీ : Oct 8, 2017 12:49 AM IST

విజయవాడలో బెట్టింగ్ ఉదంతం..బాలుడి కిడ్నాప్, హత్య !

బెట్టింగ్ వలన కుటుంబాల పరిస్థితి దిగజారడమే కాదు అనేక క్రైమ్ సంఘటనలకు కారణంగా మారుతోంది. విజయవాడలో ఇలాంటి దారుణమే జరిగింది. బెట్టింగ్ వ్యవహారం వలన 8 ఏళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. కృష్ణ లంకకు చెందిన బాలుడిని కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులని డిమాండ్ చేశారు. కానీ తలి దండ్రులు పోలీస్ లని ఆశ్రయించడంతో దుండగులు ఘోరం చేశారు.

బాలుడిని దారుణంగా హతమార్చి పరారయ్యారు. బాలుడి మృత దేహాన్ని గోనెసంచిలో ఉంచి పూడ్చిపెట్టారు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీస్ లు నిందితులని గుర్తించారు. ఈ హత్యకు కారణం బెట్టింగ్ వ్యవహారమే అని తెలుస్తోంది. నిందితులలో ఒకరు ఇంటర్మీడియట్ విద్యార్థి. యువత ఎక్కువగా బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ.

Comments