ఆ దేశంలో 3 కుర్రాళ్ళు కొట్టుకుపోయారు! ఎలా అంటే?


ఉక్రెయిన్ దేశంలో మెడిసన్ చదువుతున్న ముగ్గురు తెలుగు కుర్రాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ లో బీచ్ వాలీబాల్ ఆడుతూ ఉండగా సముద్రంలో కెరటాల దాటికి కొట్టుకుపోయి చనిపోయినట్లు సమాచారం. ఎప్పటి నుంచి ఇండియాలో వివిధ రాష్ట్రాలతో పాటు ఆంధ్రా నుంచి కూడా విద్యార్ధులు ఉక్రెయిన్ లో మెడిసన్ చేయడానికి వెళ్తున్నారు. అలా వెళ్ళిన కొద్ది రోజుల క్రితం సెలవుల్లో భాగంగా సొంత ఊరు వచ్చి తిరిగి వెళ్ళిపోయినా వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి అలా బీచ్ కి వెళ్ళారు. అక్కడ అందరు కలిసి బీచ్ వాలీబాల్ ఆడుతుండగా సముద్రంలోకి బంతి వెళ్ళడంతో తీసుకురావడానికి వెళ్ళిన ముగ్గురు యువకులు మరల తిరిగి బయటకి రాలేదు. సముద్రంలో తలెత్తే ఆటుపోట్లు సమయంలో వచ్చే విద్యుత్ తరంగాల వలన కెరటాల దాటి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో వీళ్ళు చిక్కుకోవడంతో సముద్రంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులకి వారి ఫ్రెండ్స్ సమాచారం అందించారు. మరి డెడ్ బాడీస్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. వీళ్ళలో ఓ వ్యక్తి కడపని చెందివ వాడు కాగా , మరో వ్యక్తిది హైదరాబాద్ అని సమాచారం, తమ కుమారుల మృత్యువాత తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Comments