ప్రచురణ తేదీ : Fri, Dec 30th, 2016

రూ.251 స్మార్ట్ ఫోన్ గుర్తుందా ? ఆ కంపెనీ ఎత్తేస్తున్నారు !!

Freedom-251
కొన్ని నెలల క్రితం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తాం అంటూ సంచలనమైన ఆఫర్ లు వెలువడ్డాయి గుర్తుందా ? రింగింగ్ బెల్స్ అనే కంపెనీ ఈ బంపర్ ఆఫర్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు అదే కంపెనీ కి చెందిన వార్త ఒకటి ప్రధానంగా వినిపిస్తోంది. ఆ కంపెనీ ఖేల్ ఖతం అయిపొయింది అనేది దీని సారాంశం. ఎండీ మోహిత్ గోయల్ తప్పుకోవడం తో రింగింగ్ బెల్స్ దాదాపుగా మూత పడింది అని సమాచారం. దీంతో పాటు ఆ సంస్థ లో డైరెక్టర్ అయిన అతని భార్య ధర్నా గోయల్ కూడా పదవి వదిలేసారు. దీంతో రింగింగ్ బెల్స్ ఖేల్ ఖతమైనట్టేనని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి ఎండీఎం అనే మరో నూతన కంపెనీ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.

కాగా అప్పట్లో రూ.251కే స్మార్ట్ఫోన్ను అందిస్తామని చెప్పి రింగింగ్ బెల్స్ వివాదాల్లో చిక్కుకోగా లాటరీ ప్రాతిపదికన 70వేల ఫోన్లను అందించామని కంపెనీ చెప్పుకొచ్చింది. కానీ దీనిపై యూజర్లు అస్సలు స్పందించలేదు. ఈ క్రమంలో రింగింగ్ బెల్స్ గురించి తాజాగా తెలుస్తున్న సమాచారం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అతి తక్కువ ధర స్మార్ట్ఫోన్ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించి అప్పటినుంచి రింగింగ్ బెల్స్ సంస్థ ఆర్డర్లు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ అతితక్కువ ధర వివాదానికి కారణమైంది. ఇదో మోసపూరిత పథకమన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అదే సమయంలో పెద్ద ఎత్తున ఆదరణ కూడా వచ్చింది. రెండు రోజుల సేల్ అని ప్రకటించినపుడు అయితే కంపెనీ వెబ్సైట్ క్రాష్ అయింది. ఈ డిమాండ్ గురించి కంపెనీ వివరిస్తూ సుమారు 30 వేల మంది వినియోగదారులు ఫోన్ కోసం బుక్ చేసుకున్నారని సంస్థ ప్రకటించింది. సుమారు ఏడు కోట్ల మంది ఫోన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని తెలిపింది.

Comments