ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

200 ఏళ్ల క్రితం మనిషి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు….?

dead-body
మంగోలియాలో గతేడాది వెలుగు చూసిన బౌద్ధ సన్యాసి మమ్మీపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఇది దాదాపు రెండు శతాబ్దాల నాటి మమ్మీ అని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతుండగా.. బౌద్ధుల వాదన మరోలా ఉంది. ఆయన చనిపోలేదని, ధ్యాన స్థితిలో ఉచ్చ స్థితిలోకి చేరుకోవడం వల్లే ఆలా ఉన్నారని చెబుతున్నారు. ఈ స్థితిని టుక్డం అంటారనీ, ఈ దశ దాటితే ఆయన నిజమైన బౌద్ధుడిగా మారినట్టే అన్నారు. అలా మారినవారు ఇతరులను సైతం బాగు చేయగలరని నమ్ముతారు.

2015 జనవరిలో కొందరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్లో అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా మంగోలియా అధికారులు ఈ మమ్మీని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి 200 సంవత్సరాల క్రితం బ్రతికే ఉన్నాడని గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు… ఇప్పటికీ ఆయన దేహంపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. జంతుచర్మంతో శరీరం పాడవకుండా భద్రపరచగలగడం… ఇప్పటికీ కూర్చున్న దేహం కూర్చున్నట్టుగానే ఉండడం నిపుణులైన శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కడంలేదు. 200ఏళ్లుగా ఈ శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనందున ఇది ఆధ్యాత్మిక మిస్టరీగానే భావించాలని, దీనిని శాస్త్రవేత్తలు పరిష్కరించాలని పరిశీలకులు అంటున్నారు. ఈ మమ్మీని 1927లో ఉపాధ్యాయుడిగా పని చేసి మరణించిన లామా దషి లిటిగిలోవ్ అని చెప్తున్నారు.

Comments