హీరోయిన్ పై పిచ్చి..అభిమాని కొంప ముంచింది..!

అభిమానం హద్దులు దాటకూడదనే విషయం మరో మారు సుస్పష్టం అయింది. కొందరు అభిమానులు స్టార్లపై వెర్రి అభిమానంతో వింత చేష్టలు చేస్తుంటారు. అవి వారికే ముప్పు తీసుకుని వస్తుంటాయి. తాజాగా ఓ అభిమాని అలాగే ప్రవర్తించి తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంది. ఇరాన్ కు చెందిన తబర్(19) అనే యువతి గతంలో అందాల చిలకలా ఉండేది. ప్రస్తుతం ఆ యువతి ఎలా తయారైందో ఫొటోలో చూడవచ్చు. కనీసం గుర్తు పట్టలేనంతగా మారిపోవడానికి కారణం ఆమెకు ఏంజెలినా జోలిపై ఉన్న పిచ్చి అభిమానమే.

ఎంజెలీనాలా కనిపించాలన్న ఆరాటంతో ముఖానికి దాదాపు 50 సర్జరీ లు చేయించుకుంది. అన్ని సార్లు సర్జరీ ప్రమాద కరం అనితెలిసినా వెనుకాడలేదు. తన పిచ్చి అభిమానంతో ఇంస్టాగ్రామ్ లో అగ్లి సెలేబ్రిటిగా నిలిచింది. ఎంజెలీనాలా మారడం కోసం కఠిన నియమాలు కూడా పాటించింది. 40 కేజీలు మించకుండా ఖఠినమైన ఆహార నియమాలు పాటించింది. కానీ ఇలా తన అందమైన ముఖాన్ని చెడగొట్టుకుంది.

Comments