ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

అక్కినేని వెడ్డింగ్ కి 175 మంది స్పెషల్ సెలబ్రెటీస్

టాలీవుడ్ లో అక్కనేని ఫ్యామిలీ అంటే అందరికి ఇష్టమే. కాంట్రవర్సీల జోలికి పోకుండా వారి స్థాయిలో వారు చక్కగా సినిమాలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అక్కినేని నాగార్జున అయితే ఇక కొడుకులతో సమానంగా సినిమాలు చేస్తూ.. ఇంకా నవ మన్మదుడిలానే కానిపిస్తున్నాడు. అయితే ఆయన ఇప్పుడు తన పెద్ద కుమారుడి వివాహ వేడుకను గ్రాండ్ గా చేయబోతున్నాడు. చైతు – సమంత ల పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే.వచ్చే నెల అక్టోబర్ లో వీరు రెండు ఆచారాల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. అక్టోబర్ 6న అక్కినేని నుంచి తెలుగు సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేస్తుండగా.. ఇక సమంత ఫ్యామిలీ నుంచి చర్చ్ లో క్రిస్టియన్ పద్దతిలో రింగ్ మార్చుకోనున్నారు.

అయితే ఈ వివాహ వేడుక గోవా లో ఇరు కుటుంబాలు ఘనంగా ప్లాన్ చేసుకున్నారట. ఈ రెండు పెళ్లి వేడుకలకు దాదాపు 175 మంది తారలు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతే నాగార్జున తెలుగు ప్రముఖులతో పాటు.. బాలీవుడ్ , కోలీవుడ్ అగ్ర నటులను పిలవబోతున్నాడట. ఇక నాగార్జునకి క్లోజ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ తో పాటు మెగాస్టార్ ఫ్యామిలీని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. కానీ టాలీవుడ్ నుంచి మాత్రం కొందరు మాత్రమే హారవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాగ్ పెళ్లి తర్వాత హైదరబాద్ లోనే రిసిప్షన్ గ్రాండ్ గా నిర్వహించి అప్పుడు అందరిని పిలవాలని అనుకుంటున్నారట. మరి అక్కినేని పెళ్ళికి వెళ్లబోయే ఆ స్పెషల్ టాలీవుడ్ తారలు ఎవరో చూడాలి.

Comments