ప్రచురణ తేదీ : Mon, Apr 23rd, 2018

#RRR కథ నిజంగా ఇదేనా?

టాలీవుడ్ లో గత కొంత కాలంగా అందరి చూపు #RRR పైనే ఉంది. ఈ సినిమా రావడానికి సమయం చాలానే ఉన్నా అభిమానులు మాత్రం సినిమా గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా చర్చించుకోకుండా ఉండడం లేదు. ఇంతవరకు రాజమౌళి సినిమాకు సంబందించిన ఎలాంటి న్యూస్ అధికారికంగా బయటపెట్టలేదు. అయితే ప్రస్తుతం ఆ సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న సినిమా అని మొన్నటి వరకు వార్తలు చాలానే వచ్చాయి. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే కథ మాత్రం ఒక్క రోజులోనే ఉంటుందట. సినిమా కథ ఉదయం మొదలై సాయంత్రానికి ఎండ్ అవుతుందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబందించిన సన్నివేశాలు. ఇక సెకండ్ హాఫ్ తారక్ కి సంబందించిన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఫైనల్ గా క్లైమాక్స్ లో ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తారని టాక్ వస్తోంది. ఇలా ఉదయం మొదలై సాయంత్రానికి ఎండ్ అయ్యే కథలు కమర్షియల్ గా అంత హిట్ అవ్వలేదు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Comments