అమెరికాని నైజాంగా మార్చుకున్న చెర్రీ!
రామ్‌చరణ్ `రంగస్థలం` బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తొలి వీకెండ్ నాటికి 40 కోట్ల షేర్ రాబట్టింది. అమెరికాలో తొలి రెండ్రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెట్టింది ఈ చిత్రం. అయితే ఫుల్ రన్లో కేవలం అమెరికా నుంచి మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ట్రేడ్. అంటే ఈ సినిమా అమెరికా నుంచి ఏకంగా రూ.20 కోట్ల వసూళ్లు సాధించనుందన్నది అంచనా. అంటే ఓ రకంగా అమెరికా నుంచి నైజాం నుంచి తెచ్చినంత తేబోతోందన్నమాట!
ఓవర్సీస్లో ఇప్పటికే `ధ్రువ` 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాగా చరణ్‌కి పేరు తెచ్చింది. ఆ తరవాత మళ్లీ రంగస్థలం రికార్డ్ స్థాయి వసూళ్లతో ఓవర్సీస్లో మిలియన్ డాలర్ క్లబ్లో నిలవడం అభిమానుల్లో చర్చకొచ్చింది. కేవలం రెండ్రోజుల్లోనే అమెరికాలో దాదాపు 13కోట్లు (2మిలియన్ డాలర్స్) వసూలు చేసింది ఈ మూవీ. ఫుల్ రన్లో 20 కోట్లు (3 మిలియన్ డాలర్) వసూలు చేస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు బాహుబలి తరవాత 3 మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెడుతున్న సినిమా ఇదేనని ఫారిన్ ట్రేడ్ చెబుతోంది.