ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

అప్పుడే ..బాలయ్య వసూళ్లు మొదలు పెట్టాడు ?


నందమూరి బాలకృష్ణ జోరు మాములుగా లేదు .. అయన నటిస్తున్న పైసా వసూల్ టైటిల్ తగ్గట్టే … వసూళ్లు మొదలయ్యాయి? పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 విడుదల అవుతుంది. బాలయ్య కొత్తగా కనిపిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అలాగే తన 102 వ చిత్రాన్ని కూడా అప్పుడే మొదలు పెట్టాడు బాలకృష్ణ. ఇక పైసా వసూల్ సినిమాకు సంబంధించి బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే నైజం హక్కులు ఏకంగా 7 కోట్లకు అమ్ముడుపోయాయట !! ఏషియన్ సినిమాస్ వాళ్ళు ఈ హక్కులు సొంతం చేసుకున్నారు. ఇక బాలయ్య కంచుకోటగా భావించే సీడెడ్ హక్కులు దాదాపు 2 కోట్లకు, మిగతా ఎరియస్ కూడా భారీ రేటుకు అమ్ముడై బాలయ్యకు ఉన్న క్రేజీని చూపిస్తున్నాయి. ఈ సినిమాతో తన సక్సెస్ రేటు ను మరింత పెంచుకునే దిశగా బాలయ్య అడుగులు వేస్తున్నాడు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ లో మాత్రం .. కాస్త టెన్షన్ పడుతున్నారని, దానికి కారణం పూరి జగన్నాధ్ కు ఈ మధ్య స్లమ్ లో ఉండడంతో ఈ సినిమా రిజల్స్ ఎలా ఉంటుందో అని !!

Comments