ప్రచురణ తేదీ : Mar 3, 2018 12:35 AM IST

అతిలోకసుందరికి ఓ అభిమాని ఆత్మీయ నివాళి!

ప్రముఖ నటి శ్రీదేవి లేరన్న విషయాన్ని సినీపరిశ్రమతో పాటు ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం తర్వాత సంతాప సభలు నిర్వహించి ఆ నటి గొప్పతనాన్ని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ఇటీవల తాజాగా, ఓ అభిమాని ఆమె కోసం సంగీతం వాయిస్తూ రైలులో వినూత్నంగా నివాళులర్పించాడు. ముంబైకి చెందిన బోరివలి లోకల్ రైలులో ప్రకాశ్ అనే వ్యక్తి సంగీత వాయిద్య పరికరం సారంగి అతని వద్ద ఉంది. శ్రీదేవి నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం చాందినీ లోని ‘తేరే మేరే హోనోథో పర్’ పాటను ఈ పరికరం ద్వారా వాయిస్తూ తన అభిమాన నటికి నివాళులర్పించాడు.

కాగా, అనుకోకుండా ఇదే రైలులో ప్రయాణిస్తున్న రచయిత వరుణ్ గ్రోవర్ ఈ దృశ్యాన్ని తన మొబైల్ లో బంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నిన్న రాత్రి ప్రయాణికులతో నిండిపోయిన బోరివలి లోకల్ రైలులో హ్యాండ్మేడ్ సారంగి తో ఉన్న ప్రకాశ్ అనే వ్యక్తి తేరే మేరే హోనోథో పర్ పాటను వాయించాడు. శ్రీదేవికి నివాళులర్పిస్తున్నాడనే విషయాన్ని మెల్లగా బోగీలో ప్రయాణిస్తున్న మాలో చాలామంది తెలుసుకుని అతడి ప్రతిభని, ఆమెపట్ల అతడికి వున్న అభిమానాన్ని తెగ మెచ్చుకున్నారు. నాకైతే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని వరుణ్ గ్రోవర్ ట్వీట్ చేశారు….

Comments